యూత్ ను మాయ చేస్తున్న మమితా బైజు!
- దూకుడు పెంచిన మమితా బైజు
- యూత్ లో పెరుగుతున్న క్రేజ్
- స్టార్ హీరోల ప్రాజెక్టులలో ఛాన్స్
- తమిళ .. మలయాళ సినిమాలతో బిజీ
వెండితెరకి కథానాయికగా పరిచయం కావడం .. సక్సెస్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్లడం .. స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకోవడం .. అంత తేలికగా జరిగిపోయే పనులేం కాదు. అందుకు తగిన ప్రతిభ ఉండాలి .. ఆ ప్రతిభకు తగిన అవకాశాలు .. గుర్తింపు రావాలి. వాటన్నింటినీ చాలా ఓపికగా సంపాదించుకుంటూ వచ్చిన బ్యూటీగా మమితా బైజు గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం తమిళ .. మలయాళ సినిమాలతో ఆమె చాలా బిజీ.
నిజానికి సినిమాలలో అవకాశాలను సంపాదించుకోవాలంటే గ్లామర్ ఉండాలి. అభినయం పరంగా ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలి. అయితే మమితా బైజు అంతగా గ్లామరస్ రోల్స్ చేయలేదు. కానీ చేసిన రోల్స్ పై తనదైన ముద్ర వేస్తూ వెళ్లింది. తనలోని ప్రత్యేకమైన ఆకర్షణతో యూత్ చూపులను కట్టిపడేసింది. ఈ అమ్మాయి అందమంతా నవ్వులోనే ఉందని అందరూ అనుకునేలా చేసింది. అభిమానులుగా మారిపోయేలా మాయ చేసింది.
చిన్న చిన్న హీరోల సినిమాలలో కనిపిస్తూ వచ్చిన మమితా బైజు, ధనుశ్ తో 'కర' సినిమా చేసింది. విజయ్ సినిమా 'జన నాయగన్'లో కనిపించనుంది. సూర్య సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో పలకరించనుంది. ఇక ప్రదీప్ రంగనాథన్ జోడిగా మరో సినిమా చేయనునట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాకి నిర్మాత కూడా ప్రదీప్ రంగనాథన్ అనే అంటున్నారు. దీనింతటికీ కారణం సహజమైన ఆమె నటనకు యూత్ లో ఉన్న ఆదరణ అనే చెప్పాలి. చూస్తుంటే మమితా బైజు ఒక రేంజ్ లోనే చక్రం తిప్పేలా కనిపిస్తోంది కదూ.